Breaking : ఎట్టకేలకు చిరుత చిక్కింది.

Breaking : ఎట్టకేలకు చిరుత చిక్కింది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఎట్టకేలకు చిరుత చిక్కింది. 5 రోజులుగా బోను దగ్గరకి వచ్చి వెళ్లిపోయింది చిరుత. ఐదు రోజుల క్రితం ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి వచ్చింది చిరుత. గొల్లపల్లి మీదుగా ఎయిర్ పోర్ట్ వైపు వచ్చి ఫెన్సింగ్ దూకి రన్ వే పైకి వచ్చింది. అలారమ్ మోగడంతో సీసీ కెమెరాల్లో చూసి చిరుత ఫెన్సింగ్ దూకినట్లు గుర్తించారు ఎయిర్ పోర్ట్ అధికారులు. అటవీశాఖకు సమాచారం ఇవ్వడంతో 20కి పైగా ట్రాప్ కెమెరాలు, ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. వాటిలో మేకను ఎరగా వేశారు. రెండ్రోజులుగా బోను దగ్గరికి వచ్చి తిరిగివెళ్లిపోయిన చిరుత.. ఇవాళ మేకను తినేందుకు వచ్చి బోనులో చిక్కింది. చిరుతను జూపార్క్ కు తరలించారు అధికారులు. వైద్య పరీక్షల చేసి ఒక రోజు పర్యవేక్షణలో ఉంచి.. తర్వాత చిరుతను నల్లమల అడవిలో వదిలేస్తామన్నారు అటవీశాఖ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story