TS : ఏప్రిల్ 15న మెదక్ లో కేసీఆర్ సభ
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్15న మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. కాగా కేసీఆర్ ఇటీవల మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలో ఉన్నారు. దాదాపుగా లక్షమందితో సభను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది.
మెదక్ పార్లమెంట్ స్థానంపై మొదటినుంచి బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. 2009 నుంచి ఇక్కడి బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014, 2019లో ఇక్కడి నుండి ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్.
కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలిచింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com