TG : వరంగల్‌లో బీఆర్ఎస్ అవిశ్వాసం!

TG : వరంగల్‌లో బీఆర్ఎస్ అవిశ్వాసం!
X

వరంగల్ కార్పొరేషన్ రాజకీయం హీటెక్కింది. మేయర్ గుండు సుధారాణి పార్టీని వీడటంతో అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాణిని పదవి నుంచి తప్పించాలని, ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారట వీరికి కొంతమంది కాంగ్రెస్ కార్పొరేటర్లు సహకరించే అవకాశం ఉందనే వార్తలే హాట్ టాపిక్ మారాయి.

బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయంపై చర్చలు జరిపారు. కలిసివచ్చే పార్టీలు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. గులాబీ పార్టీ పెద్దల సహకారంతో అనూహ్యంగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో మేయర్ పదవిని ఆశించిన మిగతా కార్పొరేటర్లంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటి నుంచి సుధారాణి తీరుపై గుర్రుగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవకాశం కోసం ఎదురుచూశారు. మేయర్ పై 8 మంది కార్పొరేటర్లు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైతే ఎవరి బలమెంత..? అవిశ్వాసం పెడితే తగ్గేదెవరూ..? నెగ్గేదేవరూ..? అనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఉంటే మేయర్ కుర్చీకి ఎలాంటి ముప్పు వాటిల్లదు. మేయర్ వ్యతిరేక వర్గమైన ఆ 8 మంది బీఆర్ఎస్ ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు తెలిపితే మేయర్ కుర్చీకి గండం పొంచి ఉండే చాన్సుంది.

Tags

Next Story