TS : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

బీఆర్ఎస్ లీడర్లు తగ్గేదేలే అంటున్నారు. తమ పార్టీ టికెట్ పై గెలిచి ఇతర పార్టీల్లోకి జంప్ కొట్టిన లీడర్లపై అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలతో ఉన్నారు. గులాబీ అగ్రనేతలు చెప్పిన మాటలను ఆచరణలో పెడుతున్నారు.
కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి పోటీ చేసి గెలిచారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావులకు ఊహించని షాక్ ఇస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఎమ్మెల్యే వివేకానంద.. BRS ను వీడిపోయిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వెంకట్రావు పై హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరి లోక్ సభ ప్రచారంలో కీలక రోల్ పోషిస్తున్నారు కడియం, వెంకట్రావు.
పాడి కౌశిక్ రెడ్డి కూడా గతంలోనే వీరిపై అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఇది పెండింగ్ లో ఉంది. దీంతో.. న్యాయపోరాటం మొదలుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ కు పలుమార్లు లేఖ రాసినా స్పందించలేదని పిటిషన్ లో వివేకానంద తెలిపారు. వివేకానంద పిటిషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com