TS: మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ లీడర్లు

మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం బయలుదేరింది. ఉదయం 9 : 30 గంటలకు తెలంగాణ భవన్ (Telangana bhavan) నుంచి మేడిగడ్డ (Medigadda) పర్యటనకు బయలుదేరారు. ఉప్పల్, ఘట్కేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. అన్నారంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడుతారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మేడిగడ్డకు బయలుదేరేముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియతో మాట్లాడారు. వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే ఛలో మెడిగడ్డ పర్యటనకు పిలుపునిచ్చినట్లుగా తెలిపారు. ఇవ్వాళ చేస్తున్నది మొదటి పర్యటన మాత్రమేనని తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com