Kavitha : లిక్కర్‌ స్కామ్ కేసు.. నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

Kavitha : లిక్కర్‌ స్కామ్ కేసు.. నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న BRS MLC ... కవితను ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుకానున్నారు. ED, CBI కేసుల్లో గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుంది. దీంతో ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జ్యుడిషియల్ కస్టడీ పొడగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేశారు ED అధికారులు. తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఆమెను ఏప్రిల్ 11 న CBI అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ట్రయల్ కోర్టు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఏప్రిల్ 10న కవితతో పాటు చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ ను నిందితులుగా పేర్కొంటూ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 29న ఈ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు స్పెషల్ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.

కవిత, చరణ్ ప్రీత్ ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీంతో వారికి కోర్టు ప్రొడక్షన్ నోటీసులు జారీ చేసింది. దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇవాళ జ్యూడిషియల్ కస్టడీ ముగియడంతో కవితతో పాటు మిగిలిన వారు ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు కానున్నారు.

Tags

Next Story