TS : ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్

TS : ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను శాసిస్తోంది. ఎన్నికల్లో ఇది కీలకంగా మారింది. తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టుకు వెళ్లింది. లోక్ సభ ఎన్నికల వేళ ఈ కేసులో ఉద్దేశపూర్వంగా బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషన్‌లో తెలిపింది బీఆర్ఎస్. తమపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని గులాబీ పార్టీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్టు మీడియాలో వార్తలొచ్చాయి.

పోలీసులు ఇప్పటికే పలువురు అధికారులను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు దర్యాప్తులో చెప్పినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story