TS : నేడు నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ నిరసనలు

నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తానని సీఎం చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. అలాగే రైతుభరోసా ఇవ్వట్లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తిన కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కరెంటు కోతల నియంత్రణపై చిత్తశుద్ధి లేని సీఎం రేవంత్.. అనవసరంగా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై నిందారోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తమను బాధ్యులను చేసి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్ప కూల్చిందని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com