TS : ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బీఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం: కేసీఆర్

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగాల పునాదుల మీద పుట్టి, ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో విజయాలు సాధించింది. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలోనే బీఆర్ఎస్ ది ప్రత్యేక స్థానం. ఆటుపోట్లు అధిగమించేందుకు బలమైన పునాదులు వేసింది కార్యకర్తలే’ అని పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ జెండా ఎగురవేయనున్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ ఉండటంతో ఆర్భాటాలు లేకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com