TS : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. లక్ష్మణ్ సంచలనం

TS : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. లక్ష్మణ్ సంచలనం
X

బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్నారు. కారు పని అయిపోయిందన్నారు. ఇప్పుడు జాకీ పెట్టిన లేపినా కారు లేచే పరిస్థితి లేదన్నారు.

భవిష్యత్ అంతా బీజేపీదేనని చెప్పారు. ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారని తెలిపారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు విడతల్లో బీజేపీ మెజారిటీ సాధించని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి పక్ష హోదా కూడా దక్కుతుందో లేదో చూడాలన్నారు.

రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు లక్ష్మణ్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.

Tags

Next Story