TG : ఇండ్లు కట్టించండి.. జిల్లాకో సైనిక్ స్కూల్ తెరవాలి.. భట్టి రిక్వెస్ట్

తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధాని మోడీని ( Narendra Modi ) విజ్ఞప్తి చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) తెలిపారు. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఢిల్లీలో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సాను కలిశామన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కోరామని, వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశామని తెలిపారు.
రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని కోరడంతో పాటు గత ప్రభుత్వం సాంక్షన్ చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని అడిగామని తెలిపారు. జిల్లాకొక నవోదయ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశాయని రిక్వెస్ట్ చేశామన్నారు. విజభన చట్టంలోని పెండింగ సమస్యలను త్వరగా పరిష్కారించాలని కోరామన్నారు.
రాష్ట్ర రహదారులను జాతీయ హై వేలుగా మార్చాలని ప్రధానిని కోరామని తెలిపారు భట్టి. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‌గా మార్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com