Trains : నేటి నుంచి పుష్‌పుల్‌ రైలు రద్దు

Trains : నేటి నుంచి పుష్‌పుల్‌ రైలు రద్దు

సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో సోమవారం నుంచి వచ్చే నెల 26 వరకు చేపట్టిన రోలింగ్‌ బ్లాక్‌ కార్యక్రమంలో భాగంగా వరంగ ల్‌ మీదుగా సికింద్రాబాద్‌, డోర్నకల్‌కు నడిచే పుష్‌పుల్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే వరంగల్‌–ఆదిలాబాద్‌, తిరుపతి వెళ్లు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఈ నెల 28 నుంచి వచ్చే నెల 22 వరకు వరంగల్‌కు రాకుండా దారిమళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్లు పూర్తి, పాక్షిక రద్దు, దారి మళ్లింపులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలను చేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులను కోరింది.

ప్రస్తుతం ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు సికిందరాబాద్‌ నుంచి వరంగల్‌(07462)కు వచ్చి తిరిగి మధ్యాహ్నం 1.45 గంటలకు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌(07263) వెళ్లే పుష్‌పుల్‌ రైళ్లను సోమవారం నుంచి మే 26వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేశారు. అలాగే ప్రతీ రోజు ఉదయం 6.30 గంటలకు వరంగల్‌లో బయలుదేరే కాజీపేట–డోర్నకల్‌ ప్యాసింజర్‌(07753), రాత్రి డోర్నకల్‌ నుంచి వరంగల్‌ మీదుగా కాజిపేట(07754)కు వచ్చే డోర్నకల్‌–కాజీపేట ప్యాసింజర్‌ పూర్తిగా రద్దు చేశారు. ప్రతి రోజు నడిచే డోర్నకల్‌–విజయవాడ(07755), విజయవాడ–డోర్నకల్‌(07756) ప్యాసింజర్‌ రైళ్లను కూడాఈ నెల 29 నుంచి మే 22వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story