Railways : ఏప్రిల్ 29 నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్ రద్దు

X
By - Manikanta |24 April 2024 10:21 AM IST
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో చేపడుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణం, మరమ్మతుల దృష్టా ఈ నెల 29 నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా సికింద్రాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే (12713, 14)శాతవాహన ఎక్స్‌ప్రెస్ అప్ అండ్ డౌన్ రైలును ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు, అలాగే మే 16 నుంచి 22 వరకు రద్దు చేశారు. (07757) వరంగల్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – కాజీపేట జంక్షన్‌ల మధ్య నడిచే పుష్‌పుల్ రైళు మే 3, 4 తేదీలలో రద్దు చేస్తున్నామని, అనంతరం రైళ్లు యఽథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com