Car Accident : గచ్చిబౌలిలో కారు బీభత్సం

Car Accident : గచ్చిబౌలిలో కారు బీభత్సం
X

గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కారులోనే ఇరుక్కుపోయాడు. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బీరంగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, కారులో మద్యం బాటిళ్లు లభ్య మైనట్లు సమాచారం. ఫుల్‌గా మద్యం సేవించి కారు నడుపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

Tags

Next Story