TS : బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

TS : బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

రామబాణం పోజు మాధవీలతను చిక్కుల్లో పడేసింది. ఐతే.. పోలీసు కేసులు తన కమిట్ మెంట్ కు అడ్డురావని ఆమె అంటున్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె బేగంబజార్ వద్ద రామబాణం ఎక్కుపెట్టినట్టుగా పోజు పెట్టడంపై ఓ ముస్లిం వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మసీదువైపు ఎక్కుపెట్టినట్టు తమ ఫిర్యాదులో తెలిపారు.

ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఈ వ్యవహారంపై ఇప్పటికే రాజకీయ దుమారం చెలరేగుతోంది. మాధవీలత తీరుపై ఎంఐఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైరలైన ఈ వీడియోపై మాధవి లత వివరణ కూడా ఇచ్చారు. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటరిచ్చారు మాధవీలత.

శ్రీరామ శోభాయాత్ర రోజు గాలిలో బాణం విసిరిన తనను మసీదుపై విసిరినట్లుగా క్రియేట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో కావాలనే మజ్లిస్ నేతలు పోస్ట్ చేశారని విమర్శించారు. ఇలాంటి మతకుట్రలు చేస్తే పతంగి చింపేస్తానని హెచ్చరించారు. ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story