TS : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పల్లా రాజేశ్వర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుని వెళ్లారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్‌తో పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో బూత్‌లోకి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బలవంతంగా పోలింగ్‌బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com