TS : ఎమ్మెల్యే పల్లా, కొమ్మూరి ప్రశాంత్‌పై కేసు

TS : ఎమ్మెల్యే పల్లా, కొమ్మూరి ప్రశాంత్‌పై కేసు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ పడిన ఘటనలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులపై జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ధర్మకంచ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. దీనిపై అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ ఏజెంట్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అక్కడకు చేరుకోగా.. ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో దూషణల పర్వం సాగింది. పోలీసులు వారిని పోలింగ్‌ కేంద్రం బయటకు తీసుకురాగా అక్కడా ఘర్షణకు దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద గందరగోళం సృష్టించారంటూ కాంగ్రెస్‌ నేతలు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, దాసరి క్రాంతి, మేడ శ్రీనివాస్‌, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నేతలు వీరస్వామి, మాజిద్‌, తిప్పారపు విజయ్‌, మల్లిగారి రాజు, గజ్జెల నర్సిరెడ్డి, ఉల్లెంగుల సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story