TS : ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

TS : ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) పై కేసు నమోదైంది. వనపర్తి జిల్లా కొత్తకొట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈనెల 23న కొత్తకోటలో రాజాసింగ్ ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ ముస్లింల మనోభావలు దెబ్బతినేలా ప్రసంగించారంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తకోట పోలీసు స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదు అయింది.

ఇదిలా ఉంటే పార్టీ కార్యక్రమాలకు ఎమ్మె్ల్యే రాజాసింగ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మంగళవారం గోషామహల్‌లో నిర్వహించిన విజయ సంకల్ప రథయాత్రకూ ఆయన హాజరుకాలేదు. దీంతో రాష్ట్ర నాయకత్వానికి, రాజాసింగ్‌కు మధ్య పూడ్చలేనంత దూరం పెరిగిందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం.

Tags

Next Story