TS : కేసు నమోదైనా నవనీత్ అదే స్పీడు

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్నారు. ఆమెపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కాంగ్రెస్ పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను ఈ కేసు రిజిస్టర్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
ఇటీవల షాద్నగర్ పట్టణంలో బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్టేనని మాట్లాడిన వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులు అభ్యతరం వ్యక్తంచేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఐపీసీ 188 సెక్షన్ కింద నవనీత్ పై కేసు నమోదు చేశారు. గురువారం హైదరాబాద్ లోక్ సభ పరిధిలో నిర్వహించిన ప్రచారం సందర్భంగా కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కానీ వాళ్లకు 15 నిమిషాలేమో.. తమకు 15 సెకన్లు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com