TS : మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు

బీఆర్ఎస్ యూత్ లీడర్ మన్నె క్రిశాంక్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఓయూలోని యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసినందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
ఓయూ హాస్టళ్లు, మెస్‌ల మూసివేతకు సంబంధించిన నకిలీ నోటీసులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని ఓయూ చీఫ్ వార్డెన్ జీ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది అబద్ధమని, యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని కంప్లయింట్ లో తెలిపారు. ఫేక్ మెసేజ్ సర్క్యులేషన్‌ను ఆపాలని, తప్పుడు సందేశాన్ని వ్యాప్తి చేసిన మన్నె క్రిశాంక్‌పై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ జీ శ్రీనివాస్ పోలీసులను అభ్యర్థించారు.
ఓయూ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ వై కాశయ్య మన్నె క్రిశాంక్‌పై Cr no 207/2024 U/s 466, 468, 469, 505 (1) (c ) IPC సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com