TS : ఫస్ట్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన కేసీఆర్ ఫ్యామిలీ

గడిచిన 20 ఏళ్లుగా తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ ఫ్యామిలీలో కచ్చితంగా ఒక్కరైనా పోటీలో ఉండేది. కానీ.. ఫస్ట్ టైం సీన్ మారింది. లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరంగా ఉంది. మే 13 న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగబోతుంది.
తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుండగా..ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. గత 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు.
ఈసారి మాత్రం ఒక్కరు కూడా బరిలో నిల్చోలేదు. 2001లో TRS ఆవిర్భావం తర్వాత 2004 ఎన్నికల్లో KCR కరీంనగర్ ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు. 2006, 2008 ఉపఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో గజ్వేల్ మ్మెల్యేగా, మెదక్ MPగా గెలిచి, MP పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. 2019లో ఓడిపోగా, ఈసారి పోటీలో లేరు. 20 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు బరిలో నిల్చుగా ఈసారి మాత్రం అంతా దూరంగా ఉన్నారు. అలా.. 2024 ఎన్నికలు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి రికార్డుల్లోకి ఎక్కాయి. మారిన పరిస్థితుల్లో.. క్యాండిడేట్లను గెలిపించుకోవడం మాత్రం బీఆర్ఎస్ అగ్ర లీడర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com