TS : తెలంగాణలో జులైలో కులగణన ప్రారంభం

TS : తెలంగాణలో జులైలో కులగణన ప్రారంభం
X

తెలంగాణలో కులగణన చేపట్టేందుకు బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మార్గదర్శకాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. దీనిపై బీసీ, ప్రజా సంఘాలు, పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే జులైలో కులగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కులగణన చేపట్టాల ని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనిపై జీవో కూడా విడుదల చేసింది. రూ.150 కోట్లు విడుదల చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో కులగణన ప్రక్రియపై బీసీ వెల్ఫేర్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని, అంతకంటే ముందు బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు, పార్టీలు, మేధావులు, ప్రొఫెసర్ల సలహాలు తీసుకుంటామని చెబుతున్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది.

Tags

Next Story