తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయం: చంద్రబాబు

తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అభినందన సభ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరోసారి జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాక మొదటిసారి ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు చంద్రబాబు. దీంతో నేతలు ఘనస్వాగతం పలికారు.
ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్‌లోనే స్థాపించారని ఎన్టీఆర్ ఒక వ్యవస్థ అని చంద్రబాబు అన్నారు. టీడీపీ సిద్ధాంతాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ ఉంటుందన్నారు. 1995 నుంచి 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా.. అవకాశమిచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీడీపీ వచ్చాక తెలుగువారి స్థాయి పెరిగిందని.. టీడీపీకి వచ్చి ప్రతీ అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగించామని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం రావడం ఖాయమన్నారు.
చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. చంద్రబాబు నిరంతర రాజకీయ నేత అని అన్నారు. టీడీపీ క్రమశిక్షణకు మారు పేరని పేర్కొన్నారు. రాజమండ్రిలో మహానాడు విజయవంతమైందని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com