TGSRTC : ఆర్టీసీ లోగోలో మార్పులు .. TG సిరీస్‌తో రిజిస్ట్రేషన్

TGSRTC  : ఆర్టీసీ లోగోలో మార్పులు ..   TG సిరీస్‌తో రిజిస్ట్రేషన్
X

ఆర్టీసీ బస్సులను ఇక నుంచి TG సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ పేరును సైతం TSRTC నుంచి TGSRTCగా మార్చాలని నిర్ణయించారు. త్వరలో సంస్థ లోగోలోనూ మార్పులు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో TG అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో TSని TGతో రీప్లేస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,067 ఆర్టీసీ బస్సులు ఉండగా, వాటిలో 90 శాతం బస్సులు ఏపీ సిరీస్​తోనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొనుగోలు చేసిన బస్సులను మాత్రం టీఎస్​ సిరీస్​తో రిజిస్ట్రేషన్​ చేయించారు. కాగా, త్వరలో టీఎస్​ఆర్టీసీ లోగోలో కూడా మార్పు చేస్తామని అధికారులు తెలిపారు.

ఇందులో టీఎస్ ఆర్టీసీ స్థానంలో టీజీఎస్​ఆర్టీసీ అని ఉంటుందని, లోగో డిజైన్​ కూడా కొంత మారే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే నెలాఖరు నాటికి దాదాపు 500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags

Next Story