TS : నేడు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అధికార బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కొడంగల్లో పర్యటించనుట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో సహా రూ.3,961 కోట్లతో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఇందులో రూ.2,945 కోట్లతో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని స్టార్ట్ చేయడం కూడా ఉంది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
కాగా ఇదివరకే తన సొంత సెగ్మెంట్లో పర్యటించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినా వివిధ కారణాలతో చివరి నిమిషంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో తాజాగా ఖరారైన పర్య టన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పా ట్లను నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ హర్ష. ఎస్పీ యోగేస్ గౌతమ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పి.నా రాయణరెడ్డి, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అధికారులు పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com