TS : హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్

హోళీ (Holi) పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. స్టార్ హోటల్స్ , రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉంది. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు.
హోలీ సందర్భంగా ఎలాంటి న్యూసెన్స్ చేయవద్దని అన్నారు. హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు. . రూల్స్ బ్రేక్ చేసిన వారిని అరెస్టు కూడా చేస్తామని పేర్కొన్నారు సైబరాబాద్ పోలీసులు. ఈనెల 25న ఒక్కరోజు మాత్రమే మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత యథావిధిగా దుకాణాలు ఓపెన్ అవుతాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com