Wine Shops Holiday : శ్రీరామనవమి.. రేపు వైన్ షాపులు బంద్

శ్రీరామనవమి సందర్భంగా జంటనగరాల్లో(హైదరాబాద్, సికింద్రాబాద్) వైన్ షాప్స్ మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. ఈ నెల 17న ఉ.6 గంటల నుంచి 18వ తేదీ ఉ.6 వరకు వైన్, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వైన్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వైన్ షాపులు బంద్ అని తెలియడంతో మందుబాబులు...షాపులకు క్యూ కట్టారు.
బీర్లకు భారీ డిమాండ్
తెలంగాణలో మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడింది. వైన్ షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్ విధించడంతో అటు వైన్‌షాప్ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు.
సరఫరా, విక్రయాల మధ్య అంతరం పెరగడంతో ఈ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. బ్రూవరీల యాజమాన్యాలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో బెవరేజెస్ కార్పొరేషన్ విఫలం కావడంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు సమాచారం. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో రోజుకు 2.50 లక్షల కేసుల బీరు తయారు చేయొచ్చు. ప్రస్తుతం 1.50 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతుండటంతో డిమాండ్ పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com