TS : గవర్నర్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ

TS : గవర్నర్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
X

తెలంగాణ రాష్ట్ర పదో వార్షిక ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన ఆహ్వానితులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఈ ఉదయం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ను కలిసి ఆహ్వానించారు.

జూబ్లీహిల్స్ నివాసం నుంచి రాజ్ భవన్ కు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ప్రజా భవన్ నుంచి మల్లు భట్టి కూడా రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. .

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించారు సీఎం, డిప్యూటీ సీఎం. ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించారు. పదో వార్షిక వేడుకలకు సోనియాగాంధీ వస్తుండటంతో.. ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తోంది రేవంత్ సర్కార్.

Tags

Next Story