TG : 213 మంది ఖైదీలకు సీఎం రేవంత్ క్షమాభిక్ష

TG : 213 మంది ఖైదీలకు సీఎం రేవంత్ క్షమాభిక్ష
X

ఖైదీల పక్షాన తెలంగాణ సర్కారు దయ చూపింది. ఎట్టకేలకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు జైలు జీవితం నుంచి విముక్తమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘ కాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేశారు.

స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గ దర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. దర ఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైన వారి వివరాలను హైలెవల్ కమిటీ ముందుం చారు. హైలెవల్ కమిటీ విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ సమావేశంలో చర్చకు పెట్టింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) నేతృత్వంలోని క్యాబినెట్ ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Next Story