Harish Rao : చంద్రబాబుకు సీఎం రేవంత్ గురుదక్షిణ .. హరీశ్ రావు విసుర్లు

Harish Rao : చంద్రబాబుకు సీఎం రేవంత్ గురుదక్షిణ .. హరీశ్ రావు విసుర్లు
X

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ రెడ్డి కనీసం అడగడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, పెన్నా నదుల నుండి 330 టీఎంసీల ప్లగ్ వాటర్ తీసుకెళతాం అంటే కేసీఆర్ అడ్డుకున్నారని చెప్పారు. గొడవ పడి, నిరసన తెలియజేస్తే నీళ్లు తీసుకెళ్లలేదన్నారు హరీష్ రావు. తెలంగాణ జల హక్కుల పరిరక్షణలో సీఎం రేవంత్ ఫెయిలయ్యారన్నారు. చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ తెలంగాణ నీళ్లను ఫణంగా పెట్టి చెల్లిస్తున్నారని ఆరోపించారు.

Tags

Next Story