TS : నేడు సోనియాతో రేవంత్, భట్టి భేటీ

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాష్ట్ర గీతాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.
జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళుల అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని సీఎం ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7-9 వరకు కళారూపాల కార్నివాల్, పోలీసులతో బ్యాండ్ ప్రదర్శన, డ్వాక్రా మహిళలు-ప్రముఖ సంస్థలతో ఫుడ్ స్టాళ్ల ఏర్పాటు, చివరగా బాణసంచా, లేజర్ షో నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
మరోవైపు జూన్ 1, 2, 3 తేదీల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయించారు. జూన్ 1న గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. 2న ఆస్పత్రులు, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. 3న బీఆర్ఎస్ ఆఫీసుల్లో ముగింపు వేడుకలు నిర్వహించి.. అనంతరం జాతీయ, పార్టీ జెండాలు ఎగురవేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com