TG : కమ్మ సామాజిక వర్గానికి సీఎం రేవంత్ భరోసా

తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ (ఎక్స్) ట్విట్టర్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
గురువారం తెలంగాణ కమ్మ సామాజికవర్గ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. కమ్మ సామాజికవర్గం సమస్యల పరిష్కారం కోసం ఈ సందర్భంగా వారంతా కలిసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
వారి విజ్ఞప్తి పట్ల సీఎం స్పందిస్తూ కమ్మ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇస్తూ ట్విట్టర్ వేదికగా గ్రూప్ ఫోటో పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com