TS : నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి నామినేషన్‌కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్, 23న నాగర్‌కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్‌లో పర్యటించనున్నారు.
ఈ ప్రచార సభలను విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, ర్యాలీల్లో సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలనేది లక్ష్యమని వెల్లడించాయి. వీలునిబట్టి ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 2 నుంచి 3 సభల్లో సీఎం ప్రచార సభలను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com