TS : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

TS : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన సీఎం.. బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అభివర్ణించారు. పేదలు కష్టాలు చూసిన ఇందిరాగాంధీ ఆనాడు ఈ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని ఆరోపించారు. పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని వివరించారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి దళితులను ఆదుకున్నా అని చెబుతున్నావ్ కదా కేసీఆర్ . ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చావో అక్కడ నువ్వు ఓట్లు వేయించుకోవాలి. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్‌కు కేసీఆర్ సిద్ధమా?’ అని రేవంత్ ప్రశ్నించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ మోసం చేశారని రేవంత్ ఆరోపిం

Tags

Read MoreRead Less
Next Story