TS : సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

TS : సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

ఢిల్లీలోని 10 జన్ పథ్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియాను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆహ్వాన పత్రాన్ని సోనియాకు అందజేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత బయటకు వచ్చిన రేవంత్.. మీడియాతో మాట్లాడారు.

మోదీ గ్యారెంటీకి వారంటీ అయిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. సోనియా తప్పకుండా వస్తారనీ.. ఉద్యమకారులందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుపుకుంటున్న వేడుక ఇదేననీ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.

ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ అబద్దాలేననీ.. బీజేపీని ఓడించేందుకు దేశ ప్రజలు సిద్దమయ్యారన్నారు రేవంత్. కోదండరాం కమిటీ అతిథుల ఆహ్వానంపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Tags

Next Story