TS : కాళేశ్వరం, మేడిగడ్డపై రేవంత్ కీలక రివ్యూ

TS : కాళేశ్వరం, మేడిగడ్డపై రేవంత్ కీలక రివ్యూ

కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్ ల పునరుద్దరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు.

సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులతో ఆయన చర్చలు జరిపారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా.. ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని NDSA నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు.

మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఇవాళ కేబినేట్ భేటీ జరుగకపోవటంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందన్నారు సీఎం.

Tags

Next Story