TS : వానలతో తెలంగాణలో నీటి సమస్య తీరిందన్న సీఎం రేవంత్

తిరుమలలో తన మనవడి మొక్కు చెల్లించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెండు నెలలుగా నీటి సమస్యతో బాధపడుతున్న ప్రజలకు సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో నీటి సమస్య ను తీర్చిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తన మనవడి తలనీలాల మొక్కు చెల్లించేందుకు గాను మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు సీఎం రేవంత్ కుటుంబసభ్యులు.
తిరుపతిలో గతరాత్రి బస చేసిన రేవంత్ ఫామిలీ.. బుధవారం ఉదయం మనవడి తలనీలాల మొక్కు చెల్లించి స్వామివారిని దర్శించుకుంది. హడావుడి లేకుండా వైకుంఠం క్యూలైన్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన రేవంత్ కు టీటీడీ ప్రధాన అర్చకులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. తెలుగు రాష్ట్రాలు సుఖసంతోషాలతో స్వామివారి ఆశీస్సులతో అభివృద్ధి చెందాలనీ ఆకాంక్షించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com