TS : రేపట్నుంచి సీఎం రేవంత్ జిల్లాల టూర్!

TS : రేపట్నుంచి సీఎం రేవంత్  జిల్లాల టూర్!
X

Congress : కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారానికి సిద్ధమవుతోంది. ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలును కొనసాగిస్తూనే.. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. లోక్ సభకు పోటీ చేసే పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనప్పటికి.. మహబూబ్ నగర్ వేదికగా పాలమూరు ప్రజా దీవెన సభ పేరుతో బుధవారం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖరావానికి శ్రీకారం చుట్టనున్నారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ఉమ్మడి పది జిల్లాలలో కనీసం ఐదారు జిల్లాలో ప్రభుత్వం లేదా పార్టీ కార్యక్రమాలు ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు.

అందుకు బుధవారం మహబూబ్ నగర్ లో ప్రజాదివేన సభను నిర్వహించనున్నారు. 7న ఉమ్మడి కరీంనగర్లోని వేములవాడ, సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులకు సీఎం రేవంత్రెడ్డి శంఖస్థాపన చేయనున్నారు. 8 పాతబస్తీ నుంచి శంషాబాద్ వరకు సంబంధించి మెట్రోరైలు పనులకు సీఎం.. శంఖుస్థాపన చేయనున్నారు. ఈ నెల 11న భద్రాచలం వెళ్లనున్నారు. ముందుగా భద్రాచలం రాములవారిని దర్శించుకున్నాక పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయనున్నారు. ఆ తర్వాత భద్రాచలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story