TS : సీఎం రేవంత్ వాస్తు భయం.. సెక్రటేరియట్ గేట్ మార్పు

TS : సీఎం రేవంత్ వాస్తు భయం.. సెక్రటేరియట్ గేట్ మార్పు
X

సీఎం రేవంత్‌రెడ్డికి వాస్తును ఫాలో అవుతున్నారా..? అందుకే సెక్రటేరియట్‌లోకి వచ్చే రూట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మార్చుకున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇన్నాళ్లు సెక్రటేరియట్‌లో ప్రధాన ద్వారం గుండా లోపలికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇకమీదట పడమర గేటు ద్వారా లోపలికి రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎంవో అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. గతంలో వాస్తు విషయంలో కేసీఆర్‌ను విమర్శిస్తూ వచ్చిన సీఎం రేవంత్‌ ఇప్పుడు అదే వాస్తును ఫాలో కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags

Next Story