CM Revanth Reddy : మంత్రివర్గ విస్తరణకు రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ !

CM Revanth Reddy : మంత్రివర్గ విస్తరణకు రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ !
X

మంత్రివర్గ విస్తరణ తుది దశకు చేరింది. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం రేవంత్‌తో ( Revanth Reddy ) పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు రేపు ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలూనాయక్, ఉమ్మడి అదిలాబాద్ నుంచి వివేక్, ఉమ్మడి వరంగల్ నుంచి మాధవరెడ్డి ఉన్నట్లు సమాచారం.

త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండొచ్చని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌, నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు TPCC చీఫ్ ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అతిత్వరలో చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Next Story