TS : మంచి మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిశా రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. స్టేడియంలో క్రికెట్ చూడాలనే అనాథల కోరికను ఆమె నెరవేర్చారు. ఎల్బీనగర్‌లోని ఓ అనాథాశ్రమానికి చెందిన 30 మంది పిల్లలను నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ vs లక్నో మ్యాచుకు ఆమె తీసుకెళ్లినట్లు సమాచారం. వారితో కలిసి ఆమె మ్యాచ్ వీక్షించారని, తమ అభిమాన ప్లేయర్లను దగ్గరి నుంచి చూసి పిల్లలు ఎంతో సంబరపడినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నోతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్(89*), అభిషేక్(75*) LSG బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 146* సిక్సర్లు నమోదు చేసింది. 12 మ్యాచ్‌లలోనే SRH ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 145 (2018) రికార్డును బద్దలుకొట్టింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 143 (2019), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 (2016), ముంబై ఇండియన్స్ 140 (2023) ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com