Food Safety : ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ ప్రక్షాళనకు సీఎం రేవంత్ నిర్ణయం

రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రతా విభాగం) వ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించేలా హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, వీధి ఆహా ర సంస్థల విక్రయ కేంద్రాలపై నిఘా పెంచుతోంది. ఈ క్రమంలో ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వం లోని వైద్య, ఆరోగ్యశాఖ ఫుడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ఇందుకు కొత్తగా 10 మొబైల్ ఫుడ్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మొబైల్ ల్యాబ్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా సుమారు 200 ఫుడ్ సేఫ్టీ టెస్టులను నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 17 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమించింది. తద్వారా ఆహార విక్రయ కేంద్రాలపై వరుస తనిఖీలు నిర్వహిస్తూ దేశంలోనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది.
ఆహార పదార్థాలు సరఫరా చేసే, విక్రయించే సంస్థలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీలైసె న్సు న్ను తీసుకోవాలనే నిబంధనలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కఠినంగా అమలు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని బోర్డింగ్ హాస్టల్స్, క్యాంటీన్లతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో వరుస తనిఖీలు నిర్వహిస్తోంది. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 387 హాస్టల్స్ పైన తనిఖీలు నిర్వహించి ఫుడ్ సేఫ్టీలైసెన్సులు విధిగా పొందాలని ఆదేశించింది. ఆహారాన్ని కల్తీ చేసే సంస్థలు లైసెన్సను రద్దు చేస్తూ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com