CM Revanth Reddy : నేడు అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ భేటీ

అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో ఇవాళ సీఎం రేవంత్ ( Revanth Reddy ) సమావేశం కానున్నట్లు సమాచారం. శాఖల వారీగా అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. శాఖల వారీగా పనితీరు, సమస్యలను సమీక్షించి.. ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని ORR వరకు పెంచాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. GHMC, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీల వరకు సేవల్ని విస్తరించాలన్నారు. ఈ విభాగానికి హైడ్రాగా(HYD డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) పేరు పెట్టాలని నిర్ణయించారు. డీఐజీ, SP స్థాయి అధికారులు హైడ్రా పర్యవేక్షణ బాధ్యతలు చూడాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సోమవారం యంగోన్ కార్పొరేషన్ సీఈవో, ఛైర్మన్ కిహాక్ సంగ్ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను సీఎం వివరించారు. సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, యంగోన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com