TS : కొడంగల్‌కు సీఎం.. ఒకే నెలలో ఆరోసారి టూర్

సౌతిండియాలో కాంగ్రెస్ తరపున సుడిగాలి ప్రచారంచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గం కొడంగల్ కు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో మహబూబ్ నగర్ పై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఒక్క నెలలోనే మహబూబ్ నగర్ జిల్లాకు రేవంత్ రావడం ఇది ఆరోసారి కావడం విశేషం.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లలో బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో ఓడించాలని పట్టుదలమీదున్నారు రేవంత్. ఈ పర్యటనలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు రేవంత్‌రెడ్డి. సాయంత్రం నాగర్ కర్నూల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రైతు రుణ మాఫీపై మరోసారి కీలక ప్రకటన చేసే చాన్సుంది. దీంతోపాటు.. మిగిలిన గ్యారంటీలపైనా ఓ క్లారిటీ ఇచ్చే చాన్సుంది. మహీలక్ష్మి స్కీం కింద నెలకు రూ.2500 పథకంపైనా రేవంత్ క్లారిటీ ఇచ్చే చాన్సుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com