TS : కడిగిన ముత్యంలా బయటకు వస్తా : కవిత

TS : కడిగిన ముత్యంలా బయటకు వస్తా :  కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు హాజరైన సమయంలో ఆమె మాట్లాడుతూ... 'ఇది మనీ లాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. అప్రూవర్ గా మారను. తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు.. మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు అని పేర్కొన్నారు. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.

ఎమ్మెల్సీ కవితను జ్యుడీషియల్ రిమాండు అప్పగించాలని ఈడీ కోర్టును కోరింది. 15 రోజులు కస్టడీకి పంపాలని అడిగింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలసి కవితను విచారించాల్సి ఉన్నందున, ఈ కీలక విచారణకు కవితను కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించనుంది. కవితను కస్టడీకి అప్పగిస్తే ఓకే లేకుంటే తీహార్ జైలుకు పంపే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story