KCR : రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్: కేసీఆర్

KCR : రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్: కేసీఆర్
X

జస్టిస్ నరసింహారెడ్డి ( Narasimha Reddy ) కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. కరెంట్ విషయంలో గణనీయమైన మార్పు చూపించాం. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో ఏమాత్రం నిష్పాక్షికత కనిపించట్లేదని మాజీ CM KCR అన్నారు. ‘విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. కానీ కమిషన్ ఛైర్మన్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. అందుకే నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలని KCR సూచించారు.

Tags

Next Story