TS : ఆ రెండు సెగ్మెంట్లపైనే కాంగ్రెస్ ఫోకస్

లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) ప్రెస్టీజియస్ గా తీసుకుంది. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలపై పార్టీ ఫోకస్ చేస్తోంది. కేసీఆర్ సెంటిమెంట్ గా భావించే కరీంనగర్, మెదక్ సెగ్మెంట్ లలో గెలుపు జెండా ఎగరేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. పార్టీ చేసిన అంతర్గత సర్వేలో ఈ రెండు చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని తేలడంతో పార్టీ నేతలు రంగంలోకి దిగారు. బలమైన నేతలను గుర్తించి కాంగ్రెస్ లో చేర్చుకోవాలని చూస్తున్నారు.
మెదక్ నుంచి నీలం మధును అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్.. కరీంనగర్ అభ్యర్థిపై మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. బీజేపీ, బీఆర్ఎస్ లు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా స్టార్ట్ చేశాయి. కరీంనగర్ అభ్యర్థిగా హుస్నాబాద్ టికెట్ ఆశించి భంగపడిన ప్రవీణ్ రెడ్డి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోందని ప్రచారం జరిగినా… అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పేరు తెరపైకి వచ్చింది. బండి, వినోద్ కుమార్ లపై తీన్మార్ మల్లన్న అయితేనే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే.. మరో కొత్త అభ్యర్థి పేరు కూడా తెరపైకి వచ్చే చాన్సుంది.
మెదక్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఆశీస్సులతో టికెట్ పొందిన మధు ఆయా నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ లను కలుస్తున్నారు. తనకు సహకరించాలని కోరుతున్నారు. పఠాన్ చెరు, సంగారెడ్డిలో మధుకు పరిచయాలు ఉండగా.. మిగతా నియోజకవర్గాల్లో ఇంచార్జ్ నేతల సహకారంతో ముందుకు వెళ్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com