TS : కాంగ్రెస్ అంటేనే మోసం.. కేటీఆర్ ఎటాక్

TS : కాంగ్రెస్ అంటేనే మోసం.. కేటీఆర్ ఎటాక్
X

తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, నకిరేకల్, దేవర కొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందన్నారు కేటీఆర్. 420 హామీల మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి అని ఫైరయ్యారు. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదని, 9న్నర ఏళ్ళు అధికారం కేసీఆర్ కు కట్టబెట్టగా, అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ ను నమ్మి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు.

ఆరు గ్యారంటీలు మరచిపోయిందని, 420 హామీలను తుంగలో తొక్కిందని చెప్పారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఓడిపోయామనీ.. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా.. వేతనాలు పెంచినా.. కొన్ని వర్గాల ప్రజలకు దూరం కావడంతో కేవలం 1.84 శాతం ఓట్ల తోనే ఓటమి పాలయ్యమని గుర్తు చేశారు కేటీఆర్.

Tags

Next Story