TS : ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA), ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు (Adluri Laxman Kumar) పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలం అంబారిపేట దగ్గర ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వాహనం బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కారులోనే ఉన్నారు. లక్ష్మణ్ తో పాటుగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యేను హైదరాబాద్ యశోదకు తరలించారు ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. హైదరాబాదులో ఓ వివాహానికి హాజరై తిరిగి ధర్మపురికి వెళ్తుండగా ఫిబ్రవరి 19 తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు ధర్మపురి నాయకులు సైతం ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కాగా కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com