TS : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

TS : వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

Warangal : వరంగల్ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య (Kadiyam Kavya) పేరును అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కావ్యను వరంగల్ BRS ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కావ్య అనూహ్యంగా టికెట్ వద్దనుకుని, BRSకు రాజీనామా చేశారు. హస్తం పార్టీలో చేరగా.. తాజాగా వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది. కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలను మరోసారి పెండింగ్ లో పెట్టింది.

మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) భేటీ జరిగింది. వరంగల్ ఒక స్థానానికి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించింది. అరగంట పాటు సాగిన ఈ భేటీలో మిగిలిన నాలుగు స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీలోకి బలమైన నేతల చేరికలు, స్థానిక సర్వేలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా రాష్ట్ర నాయకత్వం అందించిన అభ్యర్థుల లిస్ట్ పై ఖర్గే, సోనియా, ఇతర నేతలు చర్చించారు. అయితే ఇందులో మూడు స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినా.. ఒకరి పేరును మాత్రమే హైకమాండ్ రిలీజ్ చేసింది. దీంతో మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.

ఖమ్మం లోక్​సభ స్థానం రాష్ట్రంలోనే అత్యంత హాట్ సీటుగా మారింది. ఈ స్థానానికి భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ పోటీ పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story